
రాగల మూడు గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షం
AP: రాగల మూడు గంటల్లో కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, దీనిపై ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది. ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




