దేశ ఐక్యత కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రత్యేక నాణెం, తపాలా స్టాంపును విడుదల చేశారు. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల మాదిరిగానే ఏక్తా దివస్ (ఐక్యత దినోత్సవం) జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. ఐక్యత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పరేడ్‌లో సైనిక దళాల కవాతు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.