హైదరాబాద్‌లో 'SIR' కోసం స్పెషల్ హెల్ప్‌ డెస్క్‌లు

51చూసినవారు
హైదరాబాద్‌లో 'SIR' కోసం స్పెషల్ హెల్ప్‌ డెస్క్‌లు
TG: హైదరాబాద్‌లో SIR దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం నగరవ్యాప్తంగా 16 ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసింది. ప్రజలు ఫారమ్‌లను తప్పులు లేకుండా నింపేందుకు ఈ కేంద్రాల్లో సిబ్బంది మార్గదర్శకత్వం అందించనున్నారు. ముషీరాబాద్, మలక్‌పేట్, అంబర్‌పేట్, గోషామహల్, ఖైరతాబాద్, కార్వాన్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, సికింద్రాబాద్, కంటోన్మెంట్‌తో పాటు ట్యాంక్‌బండ్‌లోని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కార్యాలయంలో ఈ హెల్ప్‌ డెస్క్‌లు అందుబాటులో ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్