పేద ఖైదీలకు ఆర్థిక సాయం కోసం ప్రత్యేక పథకం

29చూసినవారు
పేద ఖైదీలకు ఆర్థిక సాయం కోసం ప్రత్యేక పథకం
నిరుపేద ఖైదీలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం అమల్లో ఉన్నప్పటికీ ఏపీ నుంచి ఏ ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోలేదు. తెలంగాణలో కేవలం ఐదుగురు మాత్రమే లబ్ధి పొందారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సెంట్రల్ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ఈ పథకం వినియోగం ఏ మాత్రం ప్రోత్సాహకరంగా లేదని, నిధులున్నందున సద్వినియోగం చేసుకోవాలని ఇటీవల అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది.

సంబంధిత పోస్ట్