దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు

15552చూసినవారు
దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు
దసరా, దీపావళి పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి శ్రీకాకుళం మార్గంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. చర్లపల్లి – శ్రీకాకుళం రైలు అక్టోబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం – చర్లపల్లి రైలు అక్టోబర్ 7, 14, 21, 28 తేదీల్లో మరియు నవంబర్ 4, 11, 18, 25 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.

సంబంధిత పోస్ట్