సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు: నేటి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

76చూసినవారు
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు: నేటి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) 41 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లలో ప్రయాణించడానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 8 నుండి 20 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తప్పనిసరిగా టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. బుకింగ్స్ నిమిషాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్