శబరిమల యాత్ర సీజన్‌కు సంబంధించి అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లు నడపనుంది. కాకినాడ టౌన్–కొట్టాయం, కొట్టాయం–కాకినాడ టౌన్, నాందేడ్–కొల్లామ్, కొల్లామ్–నాందేడ్, చర్లపల్లి–కొల్లామ్, కొల్లామ్–చర్లపల్లి మార్గాల్లో మొత్తం 54 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లకు టికెట్ బుకింగ్ ఇవాళ (ఆదివారం) ఉదయం 8 గంటల తర్వాత ప్రారంభమవుతుందని IRCTC వెల్లడించింది.