ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Feb 17, 2026, 08:02 IST/

ముంబైలో సామాన్యుడిలా జాగింగ్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

Feb 17, 2026, 08:02 IST
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నాలుగు రోజుల భారత్ పర్యటనలో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ముంబైకి చేరుకున్నారు. హోటల్‌కు చేరుకున్నాక, ఆయన ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా మెరైన్ డ్రైవ్‌లో జాగింగ్ చేస్తూ కనిపించారు. ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న స్థానికులు ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు, మాక్రాన్ ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనడంతో పాటు, ముంబైలో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు.