
గణేష్ నిమజ్జనం ప్రశాంతం.. ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత
హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన గణేష్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని సీపీ సజ్జనార్ వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేసినట్లు తెలిపారు. ఖైరతాబాద్ గణనాథుడిని 30 లక్షలకు పైగా, బాలాపూర్ గణేష్‌ను 15 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. నిమజ్జనాలు పూర్తయి క్రేన్లను తొలగించారు. అన్నదానం చెత్తపై ఆవేదన వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది నుంచి కలర్ పేపర్లను బ్యాన్ చేసే యోచనలో ఉన్నామని సీపీ సజ్జనార్ తెలిపారు.




