ఖమ్మం అభివృద్ధి పనులు వేగవంతం చేయండి: మంత్రి తుమ్మల

3489చూసినవారు
ఖమ్మం అభివృద్ధి పనులు వేగవంతం చేయండి: మంత్రి తుమ్మల
TG: ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌ దివాకర్, సీపీ సునీల్‌దత్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. మంచుకొండ, బుగ్గవాగు ఎత్తిపోతల పథకాలు, మున్నేరు రక్షణ గోడ, డ్రైనేజీ, కేబుల్‌ బ్రిడ్జి, మెడికల్‌ కళాశాల హాస్టల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ భవన పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఏడు కొత్త సబ్‌స్టేషన్లు ప్రతిపాదించామని, హ్యామ్‌ రోడ్లకు రూ.36.60 కోట్లు మంజూరయ్యాయని కలెక్టర్‌ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్