
కాబోయే అల్లుడి వ్యక్తిత్వం తెలుసుకోవాలని.. మామ ఏం చేశాడంటే?
AP: కాకినాడలో ఓ తండ్రి తన కూతురికి కాబోయే భర్త వ్యక్తిత్వం, సమాజం పట్ల తనకున్న బాధ్యత గురించి తెలుసుకోవాలనుకున్నారు. అతని ఆధార్ కార్డు, కారు, బైక్ నంబర్లు తీసుకొని ట్రాఫిక్ సీఐని కలిశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఆరా తీశారు. పెండింగ్ చలానాలు ఏవీ లేవని సీఐ చెప్పారు. కాబోయే అల్లుడి గురించి ఈ విధంగా ఆరా తీయడంపై సీఐ ఆయనను అభినందించారు.




