శీతాకాల షెడ్యూల్‌లో అదనంగా 100 విమానాలు నడపనున్నట్లు స్పైస్‌జెట్ సంస్థ ప్రకటించింది. 'ఇండిగో' సంక్షోభంతో మార్కెట్‌లో ఏర్పడిన డిమాండ్‌ను అందిపుచ్చుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్ ఉన్న రూట్లలో ఈ సర్వీసులను నడపనుంది. దీంతో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.