హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 'స్పోర్ట్స్, కల్చరల్ మీట్-2026' పేరిట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సలహాదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. లెమన్ అండ్ స్పూన్ పోటీలో మంత్రి కొండా సురేఖ మొదటి బహుమతి గెలుచుకున్నారు.