కెమెరాలపై స్ప్రే చల్లి.. 8 నిమిషాల్లో 2 ఏటీఎంలు చోరీ (వీడియో)

8355చూసినవారు
TG: కరీంనగర్‌లో తెల్లవారుజామున 2 ఎస్‌బీఐ ఏటీఎంలలో చోరీలు జరిగాయి. దుర్షేడు, ఎల్‌ఎండీ పరిధిలోని తిమ్మాపూర్‌లో దుండగులు ఏటీఎంలను లక్ష్యంగా చేసుకున్నారు. దుర్షేడులో స్కార్పియోలో వచ్చిన దుండగులు సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి, అలారం, కెమెరా కేబుళ్లు కట్‌ చేసి గ్యాస్‌ కట్టర్లతో ఏటీఎం మిషన్‌ను తెరిచి నగదుతో పరారైనట్లు సమాచారం. అక్కడ కేవలం 8 నిమిషాల్లోనే చోరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ రెండు ఘటనల వెనుక ఒకే ముఠా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్