వరంగల్‌కు చెందిన ఎస్‌ఆర్ విద్యాసంస్థల విద్యార్థి వీరయ్యగారి సహ్యూ
నీట్-యూజీ 2026 ఫలితాల్లో ఆల్
ఇండియా ఓపెన్ కేటగిరీలో 9వ ర్యాంకు సాధించి విశేష ప్రతిభ చాటారు. మొత్తం 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించిన సహ్యూను సంస్థ చైర్మన్ వరదారెడ్డి అభినందించారు. నాణ్యమైన బోధన, అధ్యాపకుల అంకితభావం, విద్యార్థి కృషి ఫలితంగానే ఈ ఘన విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహ్యూ తల్లిదండ్రులు, అధ్యాపకులు, సంస్థ ప్రతినిధులు ఆయనను అభినందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.