ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా రూ.100 కోట్ల భారీ ప్యాకేజీ ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మల్టీ ఫార్మాట్ ప్లేయర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కమ్మిన్స్ టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆస్ట్రేలియా జట్టును వీడొద్దనే వ్యూహంతో ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి కూడా కమ్మిన్స్ కు భారీ ఆఫర్లు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం కమ్మిన్స్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.