ఐపీఎల్ లీగ్ స్టేజీలో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన అనంతరం ఇషాన్ కిషన్ విజిల్ వేసి, ప్రేక్షకులు స్టేడియం నుంచి వెళ్లిపోవాలంటూ సంజ్ఞలు చేయడం వివాదాస్పదమైంది. అప్పుడు బాధపడిన చెన్నై అభిమానులు, నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ ఓటమి తర్వాత ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఇషాన్ కిషన్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. 'గెలిచినా ఒదిగి ఉండాలనేది నేర్చుకో. ఎలిమినేటర్లో ఓడిపోయారుగా.. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తున్నావ్' అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.