భారత యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణి అంతర్జాతీయ
టీ20 క్రికెట్‌లో సరికొత్త మైలురాయిని అందుకుంది. తాజాగా విడుదలైన
ఐసీసీ మహిళల
టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 817 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్‌గా నిలిచి..
ఆస్ట్రేలియా పేసర్ మెగాన్ షట్ (806) రికార్డును అధిగమించింది. ఏషియన్ గేమ్స్‌లో భారత్ స్వర్ణం సాధించడంలోనూ శ్రీ చరణి కీలకపాత్ర పోషించింది. మరోవైపు భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగుపరుచుకుని టాప్-5లోకి ప్రవేశించింది.