
బెజవాడ దుర్గ గుడిలో చెప్పులతో ముగ్గురు వ్యక్తుల పరుగులు
AP: బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం చోటుచేసుకుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం బయట ముగ్గురు వ్యక్తులు చెప్పులతో పరుగులు తీయడం అనుమానాలకు తావిచ్చింది. అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. వారు నిజంగా భక్తులేనా? లేక వేరే ఉద్దేశంతో వచ్చారా? అన్నదానిపై దృష్టి సారించారు. కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ టీవీ ఫుటేజ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.




