AP: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీమలయప్ప స్వామి సరస్వతీ దేవి అలంకారంలో స్వామి వారు హంస వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు కూడా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి.. దర్శించకున్నారు.