AP: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ మస్కట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమదాలవలస(M) వెదుళ్లవలసకు చెందిన నాగమణి మస్కట్‌లో మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఆమె మృతిపై తల్లి సరోజిని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా మస్కట్‌లో నాగమణి పనిచేస్తోందని ఆమె తల్లి తెలిపారు. ఏజెంట్ ద్వారా అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. పని ప్రదేశంలో తీవ్ర వేధింపులకు గురవుతున్నట్లు ఆమె చెప్పిందని పేర్కొన్నారు.