
వెంకటేశ్ అయ్యర్ ను రూ.7 కోట్లకు కొన్న ఆర్సీబీ
భారత క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అయ్యర్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో ఆర్సీబీ తీవ్రంగా పోటీపడింది. చివరికి ఆర్సీబీ అత్యధిక ధర చెల్లించి వెంకటేశ్ అయ్యర్‌ను తమ జట్టులోకి తీసుకుంది.




