
పీఎంఓ అధికారిగా నటించి మోసాలకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు
హైదరాబాద్లో పీఎంఓ అధికారిగా నటిస్తూ మోసాలకు పాల్పడిన వ్యక్తిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం ఫిర్యాదు మేరకు చర్య తీసుకుంది. రామారావు అనే వ్యక్తి టీటీడీ దర్శనాలు, భూమి రికార్డులు, యూనివర్సిటీ అడ్మిషన్ల కోసం నకిలీ సిఫార్సు లేఖలు పంపాడు. పీఎంఓ కార్యాలయం టీటీడీని సంప్రదించగా, రామారావు అనే పేరుతో డిప్యూటీ సెక్రటరీ ఎవరూ లేరని స్పష్టం చేసింది. పీఎంఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.




