
రేషన్ కార్డు ఈకేవైసీ అప్డేట్.. ఇంట్లోనే సులువుగా పూర్తి చేసుకోండి
కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. లబ్ధిదారులు రేషన్ షాపులు లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, 'మేరా రేషన్' యాప్ ద్వారా ఇంట్లోనే మొబైల్ ద్వారా రెండు నిమిషాల్లో ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. దీనికోసం 'మేరా రేషన్', 'ఆధార్ ఫేస్ ఆర్డీ' యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్‌లో రాష్ట్రం, రేషన్ కార్డు నంబర్, క్యాప్చా నమోదు చేసి, మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో పాటు ఫేస్ స్కాన్ చేస్తే కేవైసీ పూర్తవుతుంది. ఆఫ్‌లైన్‌లో రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ ద్వారా లేదా మీసేవా కేంద్రాల్లో కూడా పూర్తి చేసుకోవచ్చు.




