కల్వర్టును ఢీకొట్టిన శ్రీశైలం వెళ్తున్న వ్యాన్‌.. ముగ్గురి మృతి

4చూసినవారు
కల్వర్టును ఢీకొట్టిన శ్రీశైలం వెళ్తున్న వ్యాన్‌.. ముగ్గురి మృతి
TG: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి శివారులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 10 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్