శ్రీశైలం హుండీ ఆదాయం రికార్డు.. ఏకంగా రూ. 7.27 కోట్లు

8232చూసినవారు
శ్రీశైలం హుండీ ఆదాయం రికార్డు.. ఏకంగా రూ. 7.27 కోట్లు
AP: కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడంతో, హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. గత 33 రోజులలో భక్తులు సమర్పించిన నగదు కానుకల ద్వారా ఏకంగా రూ. 7,27,26,400 ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సుమారు రూ. 1.30 కోట్లు అధికంగా ఆదాయం వచ్చిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నగదుతో పాటు భక్తులు 117.800 గ్రాముల బంగారం, 7 కిలోల 230 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీలను కూడా కానుకలుగా సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్