శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.73 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 1.49 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.30 అడుగులుగా ఉంది. వరద ప్రవాహం పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.