శ్రీశైలం ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయబడనుంది. సెప్టెంబర్ 7 మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సెప్టెంబర్ 8 ఉదయం 5 గంటల వరకు ద్వారాలు మూసి ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై రాత్రి 1.26 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో స్పర్శ దర్శనం, ఆర్జిత సేవలు, కల్యాణోత్సవం నిలిపివేయబడ్డా
యి. సెప్టెంబర్ 8 ఉదయం శుద్ధి అనంతరం పూజలు చేసి, ఉదయం 7.30 నుంచి దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి.