AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజు ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామి కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో స్వామివారి విహరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం 31 కంపార్టుమెంట్లు నిండగా, టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 83,589 మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.4.17 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.