తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 25.12 కోట్లు

68చూసినవారు
తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 25.12 కోట్లు
AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయని TTD ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. 16 వాహన సేవలు, మూలమూర్తి దర్శనంతో పాటు గరుడసేవ రోజున అదనంగా 45,000 మందికి దర్శనం కల్పించామన్నారు. ఇప్పటివరకు 5.80 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 25.12 కోట్లు వచ్చిందన్నారు. 26 లక్షల మందికి అన్నప్రసాదం పంపిణీ, 28 లక్షల లడ్డూల విక్రయం, 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్