AP: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. అక్టోబరు 11న రాత్రి అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, పెద్దరథం, ధ్వజావరోహణం ఉండవు. వాహన సేవలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. అక్టోబరు 16న గరుడసేవ, 17న పుష్పకవిమానం, 19న స్వర్ణరథం నిర్వహించనున్నారు. 20న ఉదయం 6 గంటలకు చక్రస్నానం జరుగుతుంది. దసరా సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.