నటుడు శ్రీవిష్ణు తన కొత్త సినిమా టైటిల్‌ను అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. కోన వెంకట్ సమర్పణలో జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే, శత్రు, సాయిచంద్, బ్రహ్మాజీ, సత్య తదితరులు నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.