TG: హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెస్టారెంట్‌లో బిల్లు చెల్లించాలని అడిగినందుకు రౌడీ షీటర్లు కత్తులు, కర్రలతో సిబ్బంది, యాజమాన్యంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అర్బన్ రెస్టారెంట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి పరారీలో ఉన్న నిందితుల కొసం గాలిస్తున్నారు.