ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది ఒక రోగి చేతులు, కాళ్లను మంచానికి కట్టేసిన వీడియో వైరల్ అయింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ఆ రోగిని వేరే హాస్పిటల్‌కు రిఫర్ చేసింది. అయితే, దారిలోనే ఆ పేషెంట్ చనిపోయారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.