AP: శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశిబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి కావడంతో వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.