తమిళనాడులో శనివారం విజయ్ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో చిన్నారులు మాయమైనట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. జనాలు తోసుకోవడం వల్ల తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రులు ఏడుస్తూ వెతుకుతున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తూనే గాలింపు చేపట్టారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.