తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట దురదృష్ట కరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. మృతుల్లో చిన్నారులు ఉండటం ఆవేదన కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు.