తొక్కిసలాట ఘటన.. 39కి చేరిన మృతుల సంఖ్య

23858చూసినవారు
తమిళనాడులోని కరూర్ లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 39 మంది చనిపోయారు.  ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్