తొక్కిసలాట ఘటన.. బాధితులకు ప్రధాని మోదీ పరిహారం

8187చూసినవారు
తొక్కిసలాట ఘటన.. బాధితులకు ప్రధాని మోదీ పరిహారం
తమిళనాడులోని కరూర్‌ తొక్కిసలాట బాధితులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిహారం ప్రకటించారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షల సాయం అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి రూ.50వేల సాయం అందిస్తామని వెల్లడించారు. రాజకీయ ప్రచారసభలో ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరమని తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 39 మంది మృతి చెందారు.

సంబంధిత పోస్ట్