
నేడు ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న సూపర్ మూన్
చంద్రుడు ఇవాళ, రేపు సూపర్ మూన్గా కనువిందు చేయనున్నాడు. భూమి చుట్టూ తిరుగుతూ చంద్రుడు కొన్నిసార్లు సమీపంగా వస్తాడు. దీంతో ఈ రెండు రోజుల్లో పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడి కంటే అధిక సైజులో కనిపించి వెలుగులు పంచనున్నాడు. నేడు 14 శాతం సైజు, 30 శాతం వెలుగుతో అధికంగా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే నవంబర్, డిసెంబర్ నెలల్లో మరో రెండు సూపర్ మూన్లు దర్శనమివ్వనున్నట్లు చెబుతున్నారు.




