
ఆలయ ప్రాంగణంలో నాగుపాము (వీడియో)
AP: నంద్యాల జిల్లా మహానంది మండలం సూర్యనంది దేవస్థానంలో నాగుపాము కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో బీరువా కింది భాగంలో నాగుపాము కనిపించింది. పామును చూసి ఆలయ సిబ్బంది, భక్తులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించారు. మోహన్ అక్కడికి చేరుకుని చాకచక్యంగా నాగుపామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలారు.




