TG: తెలంగాణలో 'స్థానిక' సంస్థల ఎన్నికల అంశంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఇటీవల స్థానిక' ఎన్నికలపై దాఖలైన పిటిషన్ విచారణకు రాగా.. ఈ నెల 24కు హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలో స్థానిక
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది నిర్ణయం తీసుకుని, ఈ నెల 24 నాటికి తమకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ నెల 7న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.