రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి: మంత్రి పొన్నం

7చూసినవారు
రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి: మంత్రి పొన్నం
TG: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం సహించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మంత్రి పొన్నం బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని, కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్