రీల్ కోసం కదులుతున్న థార్ వాహనం పైకి ఎక్కి ఆకతాయిలు స్టెప్పులు వేశారు. ఇంతలో ఓ ట్రక్కు ఎదురుగా రావడంతో థార్ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి సడెన్‌గా బ్రేక్ వేశాడు. దాంతో వాహనం మీద స్టెప్పులేస్తున్న ముగ్గురు యువకులు కింద పడ్డాయి. ట్రక్కు డ్రైవర్ కూడా అదే టైంలో బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన హరియాణాలో జరిగింది.