
కశ్మీర్ లోయలో సినిమా సందడి.. థియేటర్లు హౌస్ ఫుల్
ఒకప్పుడు ఉగ్రవాదంతో భయపెట్టిన కశ్మీర్ లోని షోపియన్, పుల్వామా జిల్లాల్లో ఇప్పుడు సరికొత్త సందడి నెలకొంది. 'ధురంధర్' సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. చాలా కాలంగా పరిమిత వినోదంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు సినిమా హాళ్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సితారా ప్లెక్స్ ఎండీ రాహుల్ నెహ్రా మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో సినిమాకు వస్తున్న స్పందన తమ నమ్మకాన్ని బలపరుస్తుందని తెలిపారు. స్టార్ హీరోయిన్ సమంత కూడా 'ధురంధర్' సినిమాను ప్రశంసించింది.




