ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ప్రియాంక గాంధీకి ఏఐసీసీ పగ్గాలు?
Dec 15, 2025, 11:12 IST/

ప్రియాంక గాంధీకి ఏఐసీసీ పగ్గాలు?

Dec 15, 2025, 11:12 IST
వరుస ఎన్నికల ఓటముల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పుపై అధిష్ఠానం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రియాంక గాంధీకి ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి లేఖలు రాసినట్టు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఈ డిమాండ్ మరింత బలపడిందని చెబుతున్నారు. ఇందిరా గాంధీని తలపించే ప్రియాంక గాంధీ నాయకత్వంతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందని కొందరు నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.