రాజీనామాకు ఇంకా సిద్ధంగానే ఉన్నా: KTRకు జూపల్లి బహిరంగ సవాల్

10835చూసినవారు
రాజీనామాకు ఇంకా సిద్ధంగానే ఉన్నా: KTRకు జూపల్లి బహిరంగ సవాల్
TG: BRS హయాంలో తెలంగాణపై రూ.8,21,651 కోట్ల అప్పులు, పెండింగ్ బిల్లుల భారం మిగిలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. గన్‌పార్క్ వద్ద రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన, 2014లో రూ.90,161 కోట్లుగా ఉన్న మొత్తం బాధ్యతలు 2023 డిసెంబర్ నాటికి భారీగా పెరిగాయని తెలిపారు. "కేటీఆర్.. నేను చెప్పిన లెక్కలు తప్పని.. కేసీఆర్‌తో చెప్పించు. నా లెక్కలు తప్పని తేలితే రాజీనామాకు సిద్ధమనే మాటకు కట్టుబడి ఉన్నా" అని జూపల్లి సవాల్ విసిరారు. రాష్ట్ర అప్పులపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్