దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం చూపాయి. దీంతో ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. శుక్రవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, తర్వాత నష్టాల బాట పట్టింది. చివరకు 344.52 పాయింట్లు నష్టపోయి 84,211.88 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96.25 పాయింట్ల నష్టంతో 25,795.15కి చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.83గా ఉంది.