దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు, ఐటీ, ఆటో, మెటల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 335.97 పాయింట్లు లాభపడి 83,871.32 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 120.60 పాయింట్లు లాభంతో 25,694.95కి చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ 88.57గా ఉంది.