హోలీ పండగ సందర్భంగా ఇవాళ (మంగళవారం) స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. NSE, BSE లలో ఈక్విటీ, సెక్యూరిటీస్ ట్రేడింగ్ నిలిపివేశారు. మార్కెట్లు రేపు మళ్లీ ప్రారంభమవుతాయి. అయితే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) మాత్రం సాయంత్రం 5 గంటలకు తెరుచుకుని రాత్రి 11.30 వరకు కొనసాగుతుంది. ఈనెల 26న శ్రీరామనవమి, 31న మహావీర్ జయంతి సందర్భంగా కూడా మార్కెట్లు మూసివేయనున్నారు.